Upcoming movies telugu: డిసెంబరు ఫస్ట్‌ వీక్‌.. అటు థియేటర్‌, ఇటు ఓటీటీ వేరే లెవల్‌!

Upcoming telugu movies: 2023 చివరికి వచ్చేసింది. ఈ క్రమంలో డిసెంబరు మొదటి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించేందుకు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. మరి ఏయే సినిమాలు వస్తున్నాయో చూసేయండి.

Updated : 27 Nov 2023 11:28 IST

థియేటర్‌లో పూనకాలే..!

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. అంతేకాదు, ఇటీవల కాలంలో అత్యధిక రన్‌టైమ్‌ (3 గంటలా 21 నిమిషాలు)తో వస్తున్న సినిమా కావడం కూడా గమనార్హం. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ కలిగిన ఓ కొడుకు, అతడి కోసం ఎలా మారాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అవి ఏ పరిణామాలకు దారి తీశాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌..

కార్తిక్‌రాజు కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అథర్వ’ (Atharva Movie). సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి నిర్మాత. ‘ఇదొక భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరో సరికొత్త కథతో సుధీర్‌

సుడిగాలి సుధీర్‌, డాలీషా జంటగా అరుణ్‌ విక్కిరాలా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ‘కాలింగ్‌ సహస్ర’ రూపొందింది.


ఉపేంద్ర.. పక్కా మాస్‌

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. ‘వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా ఉంటుంది. దీంట్లో ఓ సందేశం కూడా ఉంది’ అని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!

 • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
 • దూత (తెలుగు సిరీస్‌) డిసెంబరు 1 (Dhootha web series)
 • క్యాండీ కేన్‌ లేన్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
 • నెట్‌ఫ్లిక్స్‌
 • బుజ్జిగాడు నవంబరు 30
 • ఖుషి (తెలుగు) నవంబరు 30
 • ఈ రోజుల్లో (తెలుగు) నవంబరు 30
 • బంగారు బుల్లోడు (తెలుగు) నవంబరు 30
 • ఐతే (తెలుగు)నవంబరు 30
 • ఓబ్లిటిరేటెట్‌ (ఇంగ్లిష్‌)  నవంబరు 30
 • ఫ్యామిలీ స్విచ్‌ (ఇంగ్లిష్‌)  నవంబరు 30
 • ది బ్యాడ్‌ గాయ్స్‌ : ఎ వెరీ బ్యాడ్‌ హాలీడే (యామినేషన్‌ మూవీ) నవంబరు 30
 • మిషన్‌ రాణిగంజ్‌ (హిందీ) డిసెంబరు 1 (mission raniganj)
 • స్వీట్‌ హోం: సీజన్‌-1 (కొరియన్‌) డిసెంబరు 1
 • ది ఈక్వలైజర్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
 • క్యాటరింగ్‌ క్రిస్మస్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
 • డిస్నీ హాట్‌స్టార్‌
 • ఇన్‌సైడ్‌ ఎన్‌ఎస్‌జీ  (డాక్యుమెంటరీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • చిన్నా (తమిళ్‌/తెలుగు) నవంబరు 28 (Chinna)
 • ఇండియానా జోన్స్‌: ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
 • మాన్‌స్టర్‌ ఇన్‌సైడ్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
 • సోనీలివ్
 • మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (తెలుగు) నవంబరు 29 (Martin luther king movie)

 • జియో సినిమా
 • 800 (తమిళ్‌) డిసెంబరు 2
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని