upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్‌లివే!

చిన్న చిత్రాల సందడితో మే ముగిసింది. ఆసక్తికర చిత్రాలతో జూన్‌ స్వాగతం పలుకుతోంది. మరి ఈ వారం థియేటర్‌లో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో చూసేయండి

Updated : 03 Jun 2024 10:49 IST

ఫీల్‌ గుడ్‌ మూవీ ‘మనమే’

వైవిధ్యమైన కథలతో అలరించే కథానాయకుడు శర్వానంద్‌. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వా నటించిన తాజా చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. మనలో చాలా మందికి కనెక్ట్‌ అయ్యే కథతో రూపొందించిన చిత్రమని, కొత్తదనమున్న స్టోరీ, ఫ్రెష్‌ స్క్రిప్ట్‌ అని చెప్పలేను కానీ, ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌ అని నమ్మకంగా చెప్పగలనని శర్వానంద్‌ అంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ చిత్రానికి వెళ్తే మూడు తరాల వాళ్లు ఈ కథతో కనెక్ట్‌ అవుతారని అంటున్నారు.


సూపర్‌ హ్యూమన్‌ కథే ‘వెపన్‌’

సత్యరాజ్‌, వసంత్‌ రవి కీలక పాత్రల్లో గుహన్‌ సెన్నియ్యప్పన్‌ రూపొందించిన చిత్రం ‘వెపన్‌’. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం. దర్శకుడు గుహన్‌ సరికొత్త విజన్‌తో దీన్ని ఆవిష్కరించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. దీంట్లో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌తో పాయల్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ‘ఒక పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో పాయల్‌ శక్తిమంతమైన పోలీసుగా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనుంది’ అని చిత్ర బృందం తెలిపింది.

క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘సత్యభామ’

కాజల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యభామ’ (Sathyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకుడు.  ‘ప్రతీ పాత్ర ఓ ప్రయాణమే. కానీ, ‘సత్యభామ’ మాత్రం ఓ విప్లవం. ఎవరికైనా న్యాయం చేయడం డ్యూటీ మాత్రమే కాదు.. అది వాళ్లకు మనం చేసే ప్రామిస్‌’ అంటూ దీనిపై అభిమానుల్లో ఆసక్తి పెంచారు కాజల్‌. ఆమె పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. 


రొమాంటిక్ డ్రామా ‘లవ్‌ మౌళి’

నవదీప్‌ కథానాయకుడిగా... అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి కథానాయికలు. సి స్పేస్‌ నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? తదితర ప్రశ్నలకి సమాధానాలు ఇందులో చూపనున్నట్లు దర్శకుడు చెప్పారు.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు /వెబ్‌ సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • షూటింగ్‌ స్టార్స్‌ (హాలీవుడ్)- జూన్‌ 03
  • హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05
  • హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)- జూన్‌ 05
  • బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్‌ 06

  • స్వీట్‌ టూత్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 06
  • హిట్‌ మ్యాన్‌ (హాలీవుడ్)- జూన్‌ 07
  • పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07

అమెజాన్‌ ప్రైమ్‌

  • మైదాన్‌ (హిందీ)- జూన్‌ 05

డిస్నీ+హాట్‌స్టార్‌

  • గునాహ్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05
  • క్లిప్ప్‌డ్‌- (వెబ్‌సిరీస్)- జూన్‌ 04
  • స్టార్‌వార్స్‌: ది ఎకోలైట్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 04
  • ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05

సోనీలివ్‌

  • గుల్లక్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 07
  • వర్షన్గల్కు శేషం (మలయాళం)- జూన్‌ 07

ఆహా

  • బూమర్‌ అంకుల్‌ (తమిళ)- జూన్‌07

బుక్‌ మై షో

  • ఎబిగైల్‌ (హాలీవుడ్)- జూన్‌ 07

జియో సినిమా

  • బ్లాక్‌ అవుట్‌ (హిందీ)- జూన్‌ 07
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని