upcoming movies: మే చివరి వారం.. థియేటర్‌లో అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

upcoming movies this week: గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీసులు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Published : 27 May 2024 09:55 IST

గోదావరి గ్యాంగ్‌స్టర్‌ కథ..

విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి కథానాయిక. అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ సినిమా మే 31న విడుదలవుతోంది.  ‘ఇదొక భిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. విష్వక్‌ ఇందులో లంకల రత్న అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగినట్లుగానే తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌తో కార్తికేయ

ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌, డ్రామా అన్నీ కలగలిపి తీసిన ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అందరినీ అలరిస్తుందని అంటున్నారు కార్తికేయ (Kartikeya Gummakonda). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకుడు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. మంచి ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా మూవీని తీర్చిదిద్దినట్లు దర్శకుడు చెబుతున్నారు. ఒక సామాన్య వ్యక్తి అసాధరణ సమస్యలో ఇరుక్కుంటే అందులో నుంచి ఎలా బయటపడ్డాడన్న ఆసక్తికర కథాంశంతో దీన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఫన్‌ విత్‌ యాక్షన్‌ ‘గం.. గం.. గణేశా’

‘బేబీ’తో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక.  రిష్మా, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ  మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆనంద్‌కు ఇది తొలి యాక్షన్‌ చిత్రం. దీంట్లో చక్కటి ప్రేమకథకు చోటుంది. ఇది ఈ వేసవిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమవుతుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.


క్రికెటర్‌ అవతారం ఎత్తిన జాన్వీకపూర్‌

వైవిధ్య కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న భామ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). శరణ్‌ శర్మ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌తో కలిసి ఆమె నటిస్తున్న రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ (Mr. & Mrs. Mahi). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో క్రికెటర్‌గా కనిపించేందుకు జాన్వీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది.


మూవీ: హిట్‌ లిస్ట్‌: విడుదల తేదీ: 31-05-2024


          ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు        

 • నెట్‌ఫ్లిక్స్‌
 • ఎరిక్‌ (వెబ్‌సిరీస్‌) మే 30
 • గీక్‌ గర్ల్‌ (వెబ్‌సిరీస్‌) మే 30
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • పంచాయత్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 28
 • జీ5
 • స్వతంత్ర్య వీర్‌ సావర్కర్‌(హిందీ) మే 28
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • కామ్‌డెన్‌ (వెబ్‌సిరీస్‌) మే 28
 • ది ఫస్ట్‌ ఆమెన్‌ (హాలీవుడ్) మే 30
 • ఉప్పు పులి కారమ్‌ (తమిళ) మే 30
 • జియో
 • ఇల్లీగల్‌ 3 (హిందీ సిరీస్‌) మే 29
 • దేడ్‌ బీఘా జమీన్‌(హిందీ) మే 31
 • ది లాస్ట్‌ రైఫిల్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) మే 31
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు