Telugu Movies: ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?

డిసెంబరు చివరి వారంలో బాక్సాఫీస్‌ వద్ద భారీ చిత్రాలు సందడి చేయనున్న నేపథ్యంలో ఈ వారం పలు చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలో సరికొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో చూసేద్దామా!

Updated : 11 Dec 2023 10:12 IST

ఆత్మలు మనకు హాని చేస్తాయా?

‘పిండం’ (Pindam) చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శ్రీరామ్‌. ఆయన.. ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాని సాయికిరణ్‌ దైదా తెరకెక్కించారు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ‘మరణం అనేది నిజంగానే అంతమా? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా? కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా? ఆ ఆత్మలు మనకు నిజంగానే హాని చేయగలవా?’ అంటూ ఇటీవల విడుదల చేసిన ప్రచారం చిత్రం భయపెడుతోంది. ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


థ్రిల్లరా.. హారరా..?

భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ ప్రధాన పాత్రల్లో కొండా రాంబాబు తెరకెక్కించిన చిత్రం ‘కలశ’ (Kalasa). రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


జోరుగా హుషారుగా.. అంటున్న విరాజ్‌

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా అను ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’ (joruga husharuga). నిరీష్‌ తిరువిధుల నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ కథానాయిక. ‘బేబీ’తో ఆకట్టుకున్న విరాజ్‌ నటిస్తుండటం, యువతను మెప్పించేలా ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. డిసెంబరు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


తికమక తాండ కథేంటి?

కవలలైన హరికృష్ణ, రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రం ‘తికమక తాండ’(tikamaka tanda). యాని, రేఖ నిరోషా కథానాయికలు. వెంకట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ‘ఒక ఊరి నేపథ్యంలో సాగే కథ ఇది. తికమక తాండా అని ఆ ఊరిని ఎందుకన్నారనేది తెరపైనే చూడాలి’ చిత్ర బృందం చెబుతోంది.


చేగువేరా స్ఫూర్తితో..

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం ‘చే’. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇదే. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 15న ఈ చిత్రం విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

  • అమెజాన్‌ ప్రైమ్‌
  • రీచర్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 15
  • డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
  • ది మిషన్‌ (తెలుగు) డిసెంబరు 10
  • డ్యాన్స్‌ ప్లస్‌ ప్రో (డ్యాన్స్‌ సిరీస్‌) డిసెంబరు 11
  • ఫ్యామిలీ (మలయాళం) డిసెంబరు 15
  • ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 15

  • జీ5
  • కూసే మునిసామి వీరప్పన్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 14
  • బుక్‌ మై షో
  • ది పర్షియన్‌ వెర్షన్‌ (హాలీవుడ్) డిసెంబరు 12
  • టేలర్‌ స్విఫ్ట్‌ (హాలీవుడ్) డిసెంబరు 13
  • వింటర్‌ టైడ్‌ (హాలీవుడ్) డిసెంబరు 15
  • లయన్స్‌ గేట్‌ ప్లే
  • డిటెక్టివ్‌ నైట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 15
  • జియో సినిమా
  • ది బ్లాకెనింగ్‌ (హాలీవుడ్) డిసెంబరు 16
  • ఆపిల్‌ టీవీ ప్లస్‌
  • ది ఫ్యామిలీ ప్లాన్‌ (హాలీవుడ్) డిసెంబరు 15
  • ఈటీవీ విన్‌
  • ఉస్తాద్‌ (టీవీ షో) డిసెంబరు 15
  • నెట్‌ఫ్లిక్స్‌
  • జపాన్‌ (తమిళ చిత్రం) డిసెంబరు 11

  • సింగిల్స్‌ ఇన్‌ఫెర్నో (కొరియన్‌ సిరీస్‌-3) డిసెంబరు 12
  • ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌-6) డిసెంబరు 14
  • యెల్లో (హాలీవుడ్) డిసెంబరు 15
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని