upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే..!

సంక్రాంతి తర్వాత గత వారం అన్నీ చిన్న చిత్రాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. మరి ఈ వారం థియేటర్‌లో రాబోతున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే మూవీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.

Updated : 05 Feb 2024 10:58 IST

సంక్రాంతికి వెనక్కి తగ్గి..

రవితేజ (Raviteja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని, రవితేజ ఇంతకు ముందెన్నడూ చేయని ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం చెబుతోంది.


రజనీకాంత్‌ మూవీ కూడా..

సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) కూడా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  రజనీకాంత్‌ (Rajinikanth) కీలక పాత్రలో నటించిన చిత్రమిది. దీన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: విష్ణు రంగస్వామి.


రీ-రిలీజ్‌కు సిద్ధమైన పవన్‌ మూవీ

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’. 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.


మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం చెప్పింది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

‘గుంటూరు కారం’ వచ్చేస్తోంది!

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీలో ‘మిల్లర్‌’ సందడి ఆ రోజే

ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరికొన్ని చిత్రాలు

 • నెట్‌ఫ్లిక్స్‌
 • వన్‌ డే (హాలీవుడ్‌) ఫిబ్రవరి 8
 • భక్షక్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 9

 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • ఆర్య (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 9
 • బుక్‌ మై షో
 • ఆక్వామెన్‌ (హాలీవుడ్)ఫిబ్రవరి 5
 • ఆహా
 • బబుల్‌గమ్‌ (తెలుగు) ఫిబ్రవరి 9

 • జియో సినిమా
 • ఎ ఎగ్జార్సిస్ట్‌ (హలీవుడ్) ఫిబ్రవరి 6
 • ది నన్‌2 (హాలీవుడ్) ఫిబ్రవరి 7
 • హలో (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 8
 • సన్‌నెక్స్ట్‌
 • అయలాన్‌ (తమిళ) ఫిబ్రవరి 9
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని