upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ కంటెంట్

గత వారం బాక్సాఫీస్‌ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్‌లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి.

Updated : 18 Mar 2024 10:40 IST

మరో కామెడీ ఎంటర్‌టైనర్‌..

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో సరికొత్త కామెడీ ఎంటర్‌టైన్‌ సిద్ధమైంది. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush) నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాంగ్‌ బ్రదర్స్‌గా సిటీ నుంచి పల్లెటూరికి శాస్త్రవేత్తలుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కనిపిస్తారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న గుప్తనిధులున్నాయన్న సంగతి తెలిసిన ఈ ముగ్గురూ ఏం చేశారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అనేది తెరపై చూడాలి.


హారర్‌ ప్రేమకథా చిత్రం..

 

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie).  జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన దీనిని తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


కృష్ణార్జునుల స్ఫూర్తితో..

ఆశిష్‌ గాంధీ, అశోక్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహిస్తున్నారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మాత.‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకీ కనెక్ట్‌ అవుతుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు

థియేటర్‌లో అలరించి..

శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా (bhoothaddam bhaskar narayana ott) స్ట్రీమింగ్‌ కానుంది.  రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు.


మరో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌

జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మేనుయేల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


  • నెట్‌ఫ్లిక్స్‌
  • 3 బాడీ ప్రాబ్లమ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 21
  • ఫైటర్‌ (హిందీ) మార్చి 21
  • లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) మార్చి 22
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ప్లే గ్రౌండ్‌ (హిందీ సిరీస్‌) మార్చి 17
  • మరక్కుమ నెంజాం (తమిళ) మార్చి 19
  • ఏ వతన్‌ మేరే వతన్‌ (హిందీ) మార్చి 21
  • రోడ్‌ హౌస్‌ (హాలీవుడ్‌) మార్చి 21
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • లూటేరా (హిందీ) మార్చి 22
  • బుక్‌ మై షో
  • ఫ్రాయిడ్స్‌ లాస్ట్‌ సెషన్‌ (హాలీవుడ్) మార్చి 19
  • జియో సినిమా
  • ఓపెన్‌ హైమర్‌ (హాలీవుడ్) మార్చి 21
  • ఈటీవీ విన్‌
  • సుందరం మాస్టర్‌ (తెలుగు) మార్చి 22
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని