upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి.

Updated : 20 May 2024 18:44 IST

మనసుల్ని హత్తుకునేలా..

‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది రాజుయాదవ్‌’ (Raju yadav) అంటున్నారు గెటప్‌ శ్రీను. ‘జబర్దస్త్‌’తో తెలుగు వారికి ఎంతో దగ్గరైన గెటప్‌ శ్రీను కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మాతలు. మే 17న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. వినోదంతో భావోద్వేగాలతో కూడిన కథతో మూవీని తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.


న్యూఏజ్‌ సినిమా.. లవ్‌ మీ

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌.. అన్నది ఉపశీర్షిక. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు.  ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘ఇదొక న్యూఏజ్‌ లవ్‌స్టోరీ. ఇలాంటి కథాంశంతో ఇంత వరకు ఏ చిత్రమూ రాలేదు. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం, కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. దెయ్యమని తెలిసినా అమ్మాయిని  ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని, ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.


యాక్షన్‌ అంశాలతో.. డర్టీ ఫెలో

శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). జి.ఎస్‌.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కొత్తదనంతో కూడిన యాక్షన్‌ ప్రాధాన్య చిత్రమిది. అన్ని రకాల వాణిజ్య హంగులతో నిండి ఉంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.


యాక్షన్‌, అడ్వెంచర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి వినోదాల విందును పంచడానికి మరోసారి సిద్ధమైంది ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’. ఈ ఫ్రాంఛైజీలో వస్తున్న మరో చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


 ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు ఇవే!      

 • నెట్‌ఫ్లిక్స్‌
 • టఫెస్ట్‌ ఫోర్సెస్‌ ఆన్‌ ది ఎర్త్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)మే 22
 • అట్లాస్‌ (హాలీవుడ్‌) మే 24

 • క్య్రూ (హిందీ) మే 24
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • ద టెస్ట్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 23
 • జీ 5
 • వీర్‌ సావర్కర్‌ (హిందీ) మే 28

 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • ది కర్దాషియన్స్‌ 5 (వెబ్‌సిరీస్) మే 23
 • ద బీచ్‌ బాయ్స్‌ (డాక్యుమెంటరీ మూవీ) మే 24
 • జియో సినిమా
 • ఆక్వామెన్‌-2 (తెలుగు) మే 21

 • డ్యూన్‌2 (హాలీవుడ్‌) మే 21
 • యాపిల్‌ టీవీ ప్లస్‌
 • ట్రైయింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) మే 22
 • లయన్స్‌ గేట్‌ ప్లే
 • వాంటెడ్‌ మాన్‌ (హాలీవుడ్‌) మే 24
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని