Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

Telugu Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో అలరించే కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?

Updated : 17 Apr 2023 11:32 IST

Telugu Movies: విద్యార్థుల పరీక్షలు ముగియడం, వేసవి సెలవుల నేపథ్యంలో సరికొత్త చిత్రాలు వెండితెరను పలకరిస్తున్నాయి. అలా ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి.

రుద్రవనాన్ని కాపాడే...‘విరూపాక్ష’

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) హీరోగా కార్తీక్‌ దండు తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ (Virupaksha). శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 21న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జరుగుతున్న చావులకి కారణం నేను తెలుసుకొని తీరుతాను’, ‘ఈ రుద్రవనాన్ని కాపాడగల విరూపాక్షవి నువ్వే...’ అంటూ ప్రచార చిత్రాల్లో సాగే సంభాషణలు, విజువల్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అజనీష్‌ లోక్‌నాథ్ ఈ చిత్రానికి స్వరకర్త.


ఒకే ఒక్క పాత్రతో...

గార్గేయి యల్లాప్రగడ(Gargeyi Yellapragada) ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో.. మీరా..!(Hello Meera)’. కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేవలం సింగిల్‌ క్యారెక్టర్‌తో సినిమా సాగనుంది. అదే ఇందులోని ప్రత్యేకత. సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం కథ మీరా అనే పాత్ర చూట్టూ తిరుగుతుంది. తెరపై కనిపించే మీరాతో పాటు తెర వెనుక ఫోన్‌లో వినిపించే పాత్రలు ఉత్కంఠ రేపుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • హౌ టు గెట్‌ రిచ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 18
  • చింప్‌ ఎంపైర్‌ (డాక్యుమెంటరీ)ఏప్రిల్‌ 19
  • ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌2) ఏప్రిల్ 19
  • చోటా భీమ్‌ (సీజన్‌-17) ఏప్రిల్‌ 20
  • టూత్‌పరి (హిందీ) ఏప్రిల్‌ 20

  • డిప్లొమ్యాట్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 20
  • సత్య2 (తెలుగు) ఏప్రిల్‌ 21
  • రెడీ (తెలుగు) ఏప్రిల్‌ 21
  • ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 21
  • ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 21

    సోనీలివ్‌

  • గర్మీ (సిరీస్‌)


డిస్నీ+హాట్‌స్టార్‌

  • సుగా (డాక్యుమెంటరీ స్పెషల్‌) ఏప్రిల్‌ 21
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని