Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!
ఈ వారం థియేటర్‌లో మరికొన్ని చిన్న చిత్రాలు సందడి చేయనుండగా, ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
upcoming Telugu movies: సినీ ప్రేక్షకులను అలరించడానికి ప్రతి వారం సరికొత్త చిత్రాలు బాక్సాఫీస్‌ను పలకరిస్తున్నాయి. వెండితెరపై చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. మరోవైపు ఈ వారం ఓటీటీలో పెద్ద చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటి? ఎప్పుడు వస్తున్నాయి?
అసలు భయం ముందుంది!
చిత్రం: మసూద (Masooda); నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు; సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి; నిర్మాత: రాహుల్ యాదవ్; దర్శకుడు: సాయి కిరణ్; విడుదల: 18-11-2022
మాస్ కథతో సుడి‘గాలోడు’
చిత్రం: గాలోడు (Galodu); నటీనటులు: ‘సుడిగాలి’ సుధీర్, గెహన సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీ తదితరులు; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; నిర్మాత: సంస్కృతి ఫిల్మ్స్; దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల; విడుదల: 18-11-2022
ఉత్కంఠభరిత కథతో..
చిత్రం: అలిపిరికి అల్లంత దూరంలో (alipiriki allantha dooramlo); నటీనటులు: ఎన్.రావన్‌రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి తదితరులు; సంగీతం: ఫణి కల్యాణ్; నిర్మాత: రమేశ్ దబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర; దర్శకత్వం: ఆనంద్ జె; విడుదల: 18-11-2022
విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమ కథ
చిత్రం: సీతారామపురంలో ఒక ప్రేమ జంట (Seetharama Puram Lo); నటీనటులు: రణధీర్, నందినిరెడ్డి, సుమన్, తదితరులు; సంగీతం: ఎస్.ఎస్.నివాస్; నిర్మాత: బీసు చందర్‌గౌడ్; దర్శకత్వం: వినయ్‌బాబు; విడుదల: 18-11-2022
హిందీలో అలరించేందుకు..
చిత్రం: దృశ్యం2 (drishyam 2); నటీనటులు: అజయ్‌దేవ్‌గణ్, టబు, అక్షయ్‌ఖన్నా, శ్రియ, తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; నిర్మాత: భూషణ్‌కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, కృష్ణకుమార్; దర్శకత్వం: అభిషేక్ పాఠక్; విడుదల: 18-11-2022
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్
రాజ్‌తరుణ్ పెళ్లి సందడి
వెబ్‌సిరీస్: అహనా పెళ్లంట (aha na pellanta); నటీనటులు: రాజ్‌తరుణ్, శివానీ రాజశేఖర్, హర్షవర్థన్, ఆమని, పోసాని మురళీకృష్ణ తదితరులు; సంగీతం: జుదాహ్ శాండీ; నిర్మాత: సాయిదీప్ రెడ్డి బొర్ర, సూర్య రాహుల్ తమాడ; దర్శకత్వం: సంజీవ్‌రెడ్డి; స్ట్రీమింగ్ వేదిక: జీ5; స్ట్రీమింగ్ తేదీ: 17-11-2022
అలరించే స్పై థ్రిల్లర్
చిత్రం: సర్దార్ (Sardar); నటీనటులు: కార్తి, రాశీఖన్నా, రజీషా విజయన్, చంకీ పాండే, లైలా తదితరులు; సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్; నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్; దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్; స్ట్రీమింగ్ వేదిక: ఆహా; స్ట్రీమింగ్ తేదీ: 18-11-2022
మాస్ కా బాస్ ‘గాడ్‌ఫాదర్’
చిత్రం: గాడ్‌ఫాదర్ (Godfather); నటీనటులు: చిరంజీవి, నయనతార, సల్మాన్, సత్యదేవ్ తదితరులు; సంగీతం: తమన్; నిర్మాత: ఆర్.బి.చౌదరి; ఎన్వీ ప్రసాద్; దర్శకత్వం: మోహన్‌రాజా; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్; స్ట్రీమింగ్ తేదీ: 19-11-2022
మరికొన్ని చిత్రాలు /వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- ది వండర్ (హాలీవుడ్) నవంబరు 16
- 1899 (హాలీవుడ్) నవంబరు 17
- రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17
- ఇలైట్ (హాలీవుడ్) నవంబరు 18
- స్లంబర్‌ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18
అమెజాన్ ప్రైమ్ వీడియో
- హాస్టల్‌డేజ్ సీజన్-3 (వెబ్‌సిరీస్-హిందీ) నవంబరు 16
- ది సెక్స్‌లైవ్స్ ఆఫ్ కాలేజ్‌గర్ల్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 18
డిస్నీ+హాట్‌స్టార్
- ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17
- సీతారామం (తమిళ్) నవంబరు 18
సోనీ లివ్
- అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18
- వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..