Upcoming Movies: శివరాత్రి స్పెషల్‌.. ఈవారం అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే

థియేటర్‌, ఓటీటీ వేదికగా ఈవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల వివరాలివీ..

Updated : 04 Mar 2024 10:02 IST

Upcoming movies in telugu: మార్చి రెండో వారంలో ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథా చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం పండగ (శివరాత్రి) సెలవు కావడంతో బాక్సాఫీసు వద్ద సందడి మరింత ఎక్కువగా ఉండనుంది. మరి, అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో చూసేయండి..

గోపీచంద్‌ యాక్షన్‌

గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) హీరోయిన్లు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


అఘోరాగా విశ్వక్‌

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) కథానాయిక.  ‘‘మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. దాదాపు ఆరేళ్లు ఈ స్టోరీతో ప్రయాణించాం’’ అని దర్శకుడు తెలిపారు. అఘోరా శంకర్‌గా విశ్వక్‌ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది.


అక్కడ విజయం అందుకుని..

రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ. 85 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu). నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో గిరీశ్‌ ఎ.డి. తెరకెక్కించారు. అక్కడ సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది.


పాన్‌ ఇండియా స్థాయిలో ‘రికార్డ్‌ బ్రేక్‌’

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ కీలక పాత్రలు పోషించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

నవ్వించే బాయ్స్‌

అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకుడు. హాస్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి

రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). సత్య రాజ్‌ దర్శకుడు. ‘‘కథా బలమున్న చిత్రమిది. హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఉత్కంఠ రేకెత్తించే అంశాలుంటాయి’’ అని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది.


భయపెట్టేందుకు..

అజయ్‌ దేవగణ్‌, ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది.


ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు/సిరీస్‌లు

‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించారు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

  • నెట్‌ఫ్లిక్స్‌
  • అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8
  • ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7
  • డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8
  • ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • సాగు (తెలుగు): మార్చి 4 (ఎంఎక్స్‌ ప్లేయర్‌లోనూ స్ట్రీమింగ్‌ కానుంది)
  • కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8
  • డిస్నీ+ హాట్‌స్టార్‌
  • షో టైమ్‌ (హిందీ): మార్చి 8
  • సోనీలివ్‌
  • మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌): మార్చి 7
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని