UI: వినూత్నమైన ఫాంటసీ చిత్రం ‘యూఐ’

‘ఎ’, ‘ఉపేంద్ర’ లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇటు హీరోగా.. అటు దర్శకుడిగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు ఉపేంద్ర. ఇప్పుడాయన హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ అనే ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Updated : 09 Jan 2024 09:25 IST

‘ఎ’, ‘ఉపేంద్ర’ లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇటు హీరోగా.. అటు దర్శకుడిగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు ఉపేంద్ర. ఇప్పుడాయన హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ అనే ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని లహరి ఫిల్మ్స్‌, జి.మనోహరన్‌ అండ్‌ వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌, కేపీ శ్రీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ వేడుకకు అల్లు అరవింద్‌, శివ రాజ్‌కుమార్‌ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఎటు చూసినా చీకటి. దాన్నుంచి తప్పించుకోవడం ఎలా?’’ అంటూ ఉపేంద్ర వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘‘ఇదొక వినూత్నమైన ఫాంటసీ చిత్రం. ఉపేంద్ర ఓ వీరోచితమైన పాత్రలో సరికొత్త గెటప్‌లో కనిపిస్తారు. సినిమా మొత్తాన్ని వర్చువల్‌ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించాం. ఇండస్ట్రియల్‌ లైట్‌ అండ్‌ మ్యూజిక్‌ క్రియేషన్‌ టెక్నాలజీని ఉపయోగించాం. కచ్చితంగా విజువల్స్‌, సంగీతం సరికొత్త అనుభూతిని అందిస్తాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో రీష్మా నానయ్య కథానాయికగా నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి.రవిశంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని