Uppena: బాలీవుడ్‌లోకి ‘ఉప్పెన’.. హీరోయిన్‌గా ఖుషీ కపూర్‌

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘ఉప్పెన’ను హిందీలో రీమేక్‌ చేయాలని బోనీ కపూర్‌ భావిస్తున్నారు.

Published : 22 Mar 2024 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), కృతిశెట్టి (Krithi Shetty) నటించిన యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘ఉప్పెన’ (Uppena). బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని అవార్డులను తెచ్చింది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ స్వయంగా ఈ రీమేక్‌ గురించి వెల్లడించారు.

రామ్‌చరణ్‌ తాజా చిత్రం RC16 పూజా కార్యక్రమానికి జాన్వీతో పాటు బోనీకపూర్‌ హాజరయ్యారు. ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ‘బుచ్చిబాబు ‘ఉప్పెన’ చూశాను. చాలా నచ్చింది. దీన్ని హిందీలో రీమేక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నా చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను కూడా ‘ఉప్పెన’ చూడమని చెప్పాను’ అన్నారు. దీంతో త్వరలోనే ఈ చిత్రం రీమేక్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారు.. తెలుగులో హిట్‌ అయినట్లు హిందీలోనూ అవుతుందా.. అంటూ అప్పుడే బాలీవుడ్‌లో రకరకాల కథనాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఖుషీ కపూర్‌ (khushi kapoor) రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కుమారుల సినిమాల్లో ఆమె నటించనున్నారట. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తోన్న ‘నాదనియాన్‌’ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషీని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఆమిర్‌ఖాన్‌ కుమారుడు జువైద్‌ ఖాన్‌తోనూ ఆమె జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన ‘లవ్‌టుడే’ను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారని.. ఇందులో జువైద్‌ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే త్వరలోనే జాన్వీలానే ఖుషీ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యేలా కనిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని