Double Ismart: ఈసారి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసిన పూరీ జగన్నాథ్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత హీరో రామ్‌ పోతినేని, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా ఆదివారం ఖరారైంది. రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించారు.

Published : 14 May 2023 17:46 IST

హైదరాబాద్‌: పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Ram pothineni) దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar). ఈ చిత్రం మాస్‌ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించింది. హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఊరమాస్‌ కాంబో మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌ చేయనున్నట్లు పూరీ ప్రకటించారు. ఈ సినిమాకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్‌ పోతినేని పుట్టినరోజుకు ఒకరోజు ముందే ఈ క్రేజీ అప్‌డేట్‌తో పూరీ జోష్‌ నింపారు. సినిమా వివరాలు చెప్పడంతో పాటు రిలీజ్‌ డేట్‌ను కూడా ఎన్సౌన్స్‌ చేశారు. వచ్చే ఏడాది మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు, రామ్‌ పోతినేని ప్రస్తుతం మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ చిత్రం నుంచి సోమవారం గ్లింప్స్‌ రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని రామ్‌ లుక్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని