Vadhandhi: అమెజాన్‌ వేదికగా ఎస్‌.జె సూర్య వెబ్‌సిరీస్‌..

ఎస్‌.జె. సూర్య ప్రధానపాత్రలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘వదంది’. డిసెంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అలరించడానికి సిద్ధమైంది.  

Published : 17 Nov 2022 17:46 IST

హైదరాబాద్‌: దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఎస్‌.జె సూర్య. తాజాగా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన ఈ నటుడు ఓ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నిజమేనని ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వదంది(Vadhandhi) వెబ్‌సిరీస్‌ పేరు కాగా ది ఫేబుల్ ఆఫ్‌ వెలోని‌(The Fable of Velonie) అనేది ఉపశీర్షిక. డిసెంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఈ వెబ్‌ సిరీస్‌ సిద్ధమైంది. ఫస్ట్‌లుక్‌ను పంచుకున్న సూర్య ‘నేను వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలు నిజమే. ఇది నా మొదటి వెబ్‌ సిరీస్‌. డిసెంబర్‌ 2న అమెజాన్ ప్రైమ్‌ వేదికగా మీ ముందుకు రానున్నా’ అంటూ ట్విట్‌ చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు వసంత్‌ దర్శకత్వం వహించగా పుష్కర్‌, గాయత్రి నిర్మిస్తున్నారు. ఇందులో నిన్నటితరం కథానాయిక లైల నటించనుంది. తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని