Kantara: ఆ రెండు భాషల్లో ‘వరాహరూపం’ ఒరిజినల్ వచ్చేసింది!
తమిళ్, మలయాళ వెర్షన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ‘వరాహరూపం’ ఒరిజినల్ సాంగ్‌ను జత చేసింది. ఇక తెలుగు, కన్నడ భాషల్లో యాడ్ చేయాల్సి ఉంది.
ఇంటర్నెట్‌డెస్క్: అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ‘కాంతార’ (Kantara) చిత్రాన్ని ఇప్పటికే చాలా మంది చూశారు. కానీ, అందరికీ ఒకటే వెలితి. ‘వరాహరూపం’ ఒరిజినల్ ట్యూన్ మారిపోయి ఉండటమే. ఆ పాట కాపీరైట్‌ను క్లెయిం చేస్తూ తెయ్యుకుడుం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళలోని కొయ్‌కోడ్ జిల్లా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళ్, మలయాళ వెర్షన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సాంగ్‌ను జత చేసింది. ఇక తెలుగు, కన్నడ భాషల్లో యాడ్ చేయాల్సి ఉంది. ఆ రెండు భాషల ప్రేక్షకులు ఇప్పుడు సినిమాను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసింది. మరోవైపు కేరళ పాలక్కడ్ జిల్లా కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలై ఉంది. మరి దానిపై ఎప్పుడు విచారణ చేస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఈలోగా, మలయాళ, తమిళ్ వెర్షన్స్‌లో ఒరిజినల్ పాటను జత చేయడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే నాపై విచారణ : చింతకాయల విజయ్
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష