Varun Tej-Lavanya: వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ కార్డు చూశారా..? వీడియో వైరల్‌

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ కార్డు సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. నవంబర్‌ 1న ఇటలీలో వీరి వివాహం జరగనుంది. 

Published : 27 Oct 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా ఫ్యామిలీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి(Varun Tej-Lavanya Tripathi) జంట పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. నవంబర్‌ 1న ఇటలీ(Italy)లో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రామ్‌చరణ్‌-ఉపాసన(Ram charan-Upasana) దంపతులు ఇటలీలోనే వెకేషన్‌లో ఉండగా, మెగా-అల్లు ఫ్యామిలీ సభ్యులు శుక్రవారం ఇటలీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.  

మరోవైపు వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ కార్డు(Varun Tej- Lavanya Tripathi Wedding Card) సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అయింది. మెగా అభిమానులు ఈ వీడియోను షేర్‌ చేస్తుండటంతో వైరల్‌గా మారింది. ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని