Varunlav: సందడిగా వరుణ్‌, లావణ్యల హల్దీ వేడుక.. ఫొటోలు చూశారా!

Eenadu icon
By Entertainment Team Updated : 31 Oct 2023 20:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి పెళ్లి నవంబరు 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా అక్టోబరు 30న పార్టీ జరిగింది. 31న హల్దీ వేడుక (Varun Tej- Lavanya Tripathi's Haldi ceremony) నిర్వహించారు. సంబంధిత ఫొటోలు బయటకు వచ్చాయి. నెట్టింట అవి కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. వాటిలోని ఓ ఫొటోలో వరుణ్‌, లావణ్య ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో చిరంజీవి, ఇంకో ఫొటోలో నాగబాబు, ఆయన సతీమణి కనిపించారు. వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హల్దీ వేడుకలో పాల్గొన్నారు. మరోవైపు, కాక్‌టేల్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొట్టాయి.

అందుకే వరుణ్‌ తేజ్‌ పెళ్లికి వెళ్లడంలేదు: రేణూ దేశాయ్‌

 పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. హీరో నితిన్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన కూడా వివాహానికి హాజరుకానున్నారు. సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో నవంబరు 5న రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ‘‘హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం. కానీ, ప్రైవేట్‌ వ్యవహారంగా ఉంచాలనుకోవడం వల్ల అది ఇక్కడ సాధ్యంకాదు. దాంతో, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశాం’’ అని వరుణ్‌ తేజ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :
Published : 31 Oct 2023 19:56 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు