Renu Desai: అందుకే వరుణ్‌ తేజ్‌ పెళ్లికి వెళ్లడంలేదు: రేణూ దేశాయ్‌

వరుణ్‌ తేజ్‌ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడంలేదో నటి రేణూ దేశాయ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Updated : 31 Oct 2023 09:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) పెళ్లికి తాను వెళ్లకపోవడంపై నటి రేణూ దేశాయ్‌ (Renu Desai) స్పందించారు. ఒకవేళ తాను ఆ వివాహ వేడుకకు హాజరైతే అందరూ అసౌకర్యంగా ఫీలవుతారని, అందుకే వెళ్లడంలేదని తెలిపారు. తన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger NageswaraRao) ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని రోజుల క్రితం చెప్పిన సమాధానం నెట్టింట ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘‘వరుణ్‌ నా ముందే పెరిగాడు. నా ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయి. నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించా. ఒకవేళ వరుణ్‌ పెళ్లికి వెళ్తే అసౌకర్యంగా ఫీలవుతారు’’ అని పేర్కొన్నారు.

అప్పుడు లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు మృణాల్‌కు అల్లు అరవింద్‌ బ్లెస్సింగ్స్‌

వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య (Lavanya Tripathi)ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబరు 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వరుణ్‌, లావణ్యల కుటుంబాలు, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఈ పెళ్లి సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే, ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక నవంబర్‌ 5న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నటిగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రీ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్‌. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె.. హేమలతా లవణం పాత్ర పోషించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని