VarunLav: ఘనంగా వరుణ్‌ తేజ్‌- లావణ్య రిసెప్షన్‌.. ప్రముఖుల సందడి

హైదరాబాద్‌లో నిర్వహించిన వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు టాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 06 Nov 2023 01:23 IST

హైదరాబాద్‌: వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల రిసెప్షన్‌ ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్‌. కన్వెషన్‌ (మాదాపూర్‌) ఈ వేడుక (Varun Tej- Lavanya Tripathi Reception)కు వేదికైంది. టాలీవుడ్‌కు చెందిన జయసుధ, వెంకటేశ్‌, జగపతిబాబు, మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌, ముత్యాల సుబ్బయ్య, అశ్వినీదత్‌, అలీ, సునీల్‌, దిల్‌రాజు, సుకుమార్‌, బోయపాటి శ్రీనివాస్‌, గుణశేఖర్‌, బెల్లంకొండ సురేశ్‌, సుమ, బన్నీవాసు, వెంకీ అట్లూరి, చోట కే నాయుడు, జ్ఞానశేఖర్‌తోపాటు పలువురు సినీదర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వైభవంగా అమలా పాల్‌ వివాహం.. ఫొటోలు షేర్‌ చేసిన వరుడు

దాదాపు ఆరేళ్లు ప్రేమలో ఉన్న వరుణ్‌, లావణ్య పెద్ద అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకను ఇటలీలో నవంబరు 1న వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మెగా, అల్లు కుటుంబాలు, లావణ్య కుటుంబం, హీరో నితిన్‌ దంపతులు.. ఇలా కొద్దిమంది మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వారి కోసం హైదరాబాద్‌లో ఆదివారం ప్రత్యేకంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. వరుణ్‌, లావణ్యలు కలిసి ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల చిత్రీకరణ సమయంలోనే వారి మధ్య ప్రేమ పుట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని