Amala Paul: వైభవంగా అమలా పాల్‌ వివాహం.. ఫొటోలు షేర్‌ చేసిన వరుడు

అమలా పాల్‌ వివాహం వైభవంగా జరిగింది. ఆమెను పెళ్లాడిన వ్యక్తి ఎవరంటే?

Updated : 05 Nov 2023 22:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ అమలా పాల్‌ (Amala Paul) జీవితంలో కొత్త దశను ప్రారంభించారు. ఆమె వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, పర్యాటక, ఆతిథ్య రంగాల నిపుణుడు జగత్‌ దేశాయ్‌ (Jagat Desai)ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు కొచ్చిలోని (కేరళ) ఓ హోటల్‌ వేదికైంది. తమ పెళ్లి ఫొటోలను జగత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘రెండు ఆత్మలు..ఒక విధి.. ఆమె చేతిలో చేయి వేసి జీవితాంతం ఇలానే నడుస్తా’’ అని వ్యాఖ్యానించారు (Amala Paul Marriage). ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు స్పందించారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది.

బాలకృష్ణను చూసి బాలీవుడ్ నటులు నేర్చుకోవాలి: పాయల్‌ ఘోష్‌

అమలా పాల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబరు 26న జగత్‌ ఆమెకు ప్రపోజ్‌ చేశారు. సంబంధిత దృశ్యాలను ఇన్‌స్టా వేదికగా పంచుకోవడంతో వీరి పెళ్లిపై నెట్టింట చర్చ సాగింది. ఇప్పుడు పెళ్లి ఫొటోలతో జగత్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కేరళకు చెందిన అమలా పాల్‌.. ‘బెజవాడ’ (నాగ చైతన్య) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత, ‘ఇద్దరమ్మాయిలతో’ (అల్లు అర్జున్‌), ‘నాయక్‌’ (రామ్‌ చరణ్‌) తదితర చిత్రాలతో అలరించారు. కెరీర్‌లో దూసుకెళ్తోన్న సమయంలో దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ని ఆమె వివాహం చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని