Varun Tej: ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి కారణం అదే: వరుణ్‌తేజ్‌

ఇటలీలోనే తన వివాహం ఎందుకు జరిగిందన్న అంశం గురించి వరుణ్‌ తేజ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Updated : 20 Feb 2024 15:01 IST

హైదరాబాద్‌: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కొత్త సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరణ్ తేజ్‌ తన వివాహం ఇటలీలో వివాహం జరగడానికి గల కారణాన్ని వెల్లడించారు. ‘‘నా కుటుంబం చాలా పెద్దది. సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో ఇక్కడ మా వివాహం జరిగితే  ఆ వేడుకను పూర్తిగా ఆస్వాదించలేరు.  ఇది మా వ్యక్తిగత విషయం అనుకున్నాం. అందుకే ఇటలీలో వివాహం వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సాధారణంగా పెళ్లి అంటే అనేక మందిని ఆహ్వానిస్తాం. కానీ కేవలం 100 మందిని మాత్రమే పెళ్లికి పిలిచాం. వారంతా నా ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమైన వాళ్లు కావడంతో కజిన్స్‌ ఎక్కువ ఎంజాయ్‌ చేశారు. పెళ్లిలో మా కుటుంబమంతా ఆనందంగా గడిపింది’’ అని తెలిపారు.

ప్రేమికుల రోజు సందర్భంగా లావణ్యకు ఇచ్చిన బహుమతి ఏంటని అడిగిన ప్రశ్నకు వరుణ్‌ సమాధానం చెప్పారు. ‘‘ గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడానికి మేము కాలేజ్‌ విద్యార్థులం కాదు. ఎటువంటి బహుమతి ఇవ్వలేదు. వెకేషన్‌ కోసం కశ్మీర్‌ వెళ్లాం’’ అని వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఇందులో వరుణ్‌ ఫైటర్‌జెట్‌ పైలెట్‌గా నటించారు. మానుషి చిల్లర్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని