Varun Tej: ఆ పోస్టర్‌లో మా నాన్నను చూస్తే భయమేసింది: వరుణ్‌ తేజ్‌

Eenadu icon
By Entertainment Team Published : 14 Jun 2024 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పరువు’ (Paruvu) వెబ్‌సిరీస్‌ పోస్టర్‌లో తన తండ్రి నాగబాబుని చూస్తే భయమేసిందని హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) సరదాగా అన్నారు. విలన్‌ పాత్రలో ఒదిగిపోయారని చెబుతూ అలా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆ సిరీస్‌ ప్రీ లాంచ్‌ ఈవెంట్‌కు వరుణ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నరేశ్‌ అగస్త్య (Naresh Agasthya), నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj), నాగబాబు ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ నాయుడు, రాజశేఖర్‌ వడ్లపాటి సంయుక్తంగా రూపొందించిన సిరీస్‌ ఇది. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

‘దేవర’ రిలీజ్‌ డేట్‌ మారింది.. ముందే వస్తున్నాడు

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ను మా ఫ్యామిలీతో కలిసి చూశా. చాలా బాగుంది. థియేటర్ అయినా ఓటీటీ అయినా.. కంటెంట్‌ బాగున్న ప్రాజెక్టులను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆడియన్స్‌ను ఈ సిరీస్‌ ఆకట్టుకుంటుందని భావిస్తున్నా. విప్లవ్ ఎడిటింగ్‌ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అదిరిపోయింది. సిరీస్‌లో సహజత్వం కనిపించింది. రైటర్, డైరెక్టర్లకు కంగ్రాట్స్. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతిభావంతుడైన డైరెక్టర్‌ పవన్‌ సాధినేని ‘షో రన్నర్‌’గా వ్యవహరించడం విశేషం. నరేశ్‌ అగస్త్య విలక్షణ నటుడు. తన కెరీర్‌ ప్రారంభం నుంచీ నివేదా విభిన్న పాత్రలే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. మా నాన్నని ఈ పోస్టర్‌లో చూస్తే నాకే భయమేసింది (నవ్వుతూ). మా సుస్మిత అక్క తనదైన దారిలో ప్రయాణిస్తోంది. ఆమెను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఈ సిరీస్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

‘‘పరువు.. చాలా సున్నితమైన అంశం. పరువు హత్యల వల్ల బాధపడుతున్న వారి గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సిద్ధార్థ్‌, రాజ్ ఈ స్క్రిప్ట్ రాశారు. ఇందులో ఎన్నో లేయర్స్, ఎన్నో కారెక్టర్లు ఉన్నాయి. పవన్‌ సాధినేని లేకపోతే ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు. నరేశ్‌ అగస్త్య, నివేదా తదితరులంతా తమ నటనతో కట్టిపడేస్తారు’’ అని సుస్మిత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు