GOAT: విజయ్‌ ‘ది గోట్‌’.. అప్‌డేట్‌ షేర్‌ చేసిన దర్శకుడు

విజయ్‌ ‘ది గోట్‌’పై దర్శకుడు వెంకట్‌ ప్రభు అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 18 May 2024 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను దర్శకుడు షేర్‌ చేశారు. దీంతో విజయ్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాలో సాంకేతికతకు పెద్దపీట వేయనున్నట్లు గతంలోనే వెంకట్‌ ప్రభు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీని విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ కోసం ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి పనిచేసిన సాంకేతిక నిపుణులు దీనికి పనిచేశారు. తాజాగా దీని వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తయినట్లు దర్శకుడు తెలిపారు. ఓ ఆసక్తికర ఫొటోను కూడా షేర్‌ చేశారు. అందులో విజయ్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.       ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులు ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు పూర్తి చేశారు.

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు