ఈ సాహసానికి స్ఫూర్తి ఎవరంటే!

సినిమా కోసం...అందులోని పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడితేనే ఆ పాత్ర పండుతుంది అని బలంగా నమ్మే బాలీవుడ్‌ యువ కథానాయకుల్లో విక్కీ కౌశల్‌ ఒకడు.....

Published : 12 Mar 2021 12:52 IST

ముంబయి: సినిమా కోసం...అందులోని పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడితేనే ఆ పాత్ర పండుతుంది అని బలంగా నమ్మే బాలీవుడ్‌ యువ కథానాయకుల్లో విక్కీ కౌశల్‌ ఒకడు. ‘రాజీ’, ‘సంజు’, ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’...ఇలా విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేకత ఏంటో చాటుకున్నాడు విక్కీ. ఇప్పుడు చేతినిండా చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నాడు. తాజాగా నటిస్తున్న చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు. గుర్రంపై నిల్చొని రెండు చేతులతో బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఓ ఫీట్‌ చేశాడు. దీన్ని ఇన్‌స్టాలో పంచుకున్నాడు. పైగా దీనికి స్ఫూర్తి అనిల్‌ కపూర్‌ గీసిన పెయింటింగ్‌ అంటున్నాడు. అనిల్‌కపూర్‌ మజ్ను భాయిగా నటించిన ‘వెల్‌కమ్‌’ చిత్రంలో ‘గుర్రంపై గాడిద’ కూర్చొని ఉన్న బొమ్మే స్ఫూర్తని చెబుతూ పోస్ట్‌ చేశాడు విక్కీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని