Vidhya vasula aham: అహం.. కలహం

దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్‌ విజయ్‌, శివాని జంటగా నటించిన చిత్రమిది.

Updated : 16 May 2024 09:35 IST

దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్‌ విజయ్‌, శివాని జంటగా నటించిన చిత్రమిది. మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించారు. మహేశ్‌ దత్తా, లక్ష్మి నవ్య నిర్మాతలు. ఈ నెల 17న ఆహాలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానాయకుడు రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ ‘‘ఒక అందమైన జంట నేపథ్యంలో... అంతే అందమైన అహం చుట్టూ సాగే కథ ఇది. సరదాగా హాయిగా కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది. కొత్తగా వచ్చే ప్రతి నటుడికీ జీవితంలో కొన్ని సినిమాలు చేయాలనే కోరిక ఉంటుంది. కథానాయకుడు వెంకటేశ్‌ సర్‌లాగా కుటుంబ కథలు చేయాలని ఉండేది. మణికాంత్‌ ఫోన్‌లో పంపిన ఈ కథ చదవగానే వెంటనే ఓకే చెప్పి చేశా’’ అన్నారు. శివాని మాట్లాడుతూ ‘‘రాహుల్‌ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను మంచి రచయిత కూడా. తను ఓకే చేశాడంటే కథ బాగుంటుందని నాకు అర్థమైంది. వెంటనే ఓకే చెప్పా. ఆ వెంటనే ‘కోట బొమ్మాళి’ సినిమాకీ ఓకే చెప్పా. అలా గత రెండేళ్లుగా రాహుల్‌తో కలిసి ప్రయాణం చేశా. ఈగోలేని వ్యక్తి రాహుల్‌’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వెంకీ రాసిన ఈ స్క్రిప్ట్‌ వల్లే ఈ సినిమా చేయగలిగా. ఈ నెల 17న ఎవ్వరూ థియేటర్లకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఎటువంటి అహం లేకుండా మేమే ఆహాతో ప్రతి ఇంటికీ వస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణి మాలిక్‌తో పాటు, ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని