Vidya Balan: అందుకే నాతో నటించేందుకు హీరోలు ఇష్టపడరు: విద్యాబాలన్‌

కొందరు స్టార్స్‌ తనతో నటించేందుకు ఇష్టపడరని నటి విద్యాబాలన్‌ అన్నారు. 

Published : 13 Apr 2024 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ నేపథ్యం లేకపోయినా స్టార్‌గా ఎదిగారు నటి విద్యాబాలన్‌ (Vidya Balan). హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తనతో నటించేందుకు కొందరు హీరోలు ఇష్టపడరని చెప్పారు. అలాగే నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి సందేశం ఉంటుంది. వాటిని ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తారు. కొందరు నటులు ఆ విషయాన్ని సహించలేరు. ఇది నిజం. నేను ఎక్కువగా ఇలాంటి సినిమాలే చేస్తాను కాబట్టి నాతో నటించేందుకు ఇష్టపడరు. ఈ విషయంలో నేనేం బాధపడను. సినిమా పరిశ్రమలో బంధుప్రీతి ఉందంటే నేను అంగీకరించను. ఒకవేళ నెపోటిజం ఉండి ఉంటే తారల పిల్లలంతా సక్సెస్‌ అయ్యేవారు. పరిశ్రమ ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. నేను కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. కాబట్టే నాపై ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. నా కుటుంబంలో ఎవరైనా సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నట్లైతే నా గుర్తింపు వేరుగా ఉండేది. నాకు వచ్చిన అవకాశాలన్నీ నటన వల్ల వచ్చాయి కానీ, నా నేపథ్యం చూసి రాలేదు’ అని చెప్పారు.

ప్రస్తుతం విద్యాబాలన్‌ నటించిన ‘ప్యార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భూల్‌ భులయ్యా 3’ (Bhool Bhulaiyaa 3)లో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఇది రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని