Vijay Antony: నేను క్షేమంగానే ఉన్నా.. త్వరలోనే మీతో మాట్లాడతా: విజయ్ ఆంటోని
తన ఆరోగ్య పరిస్థితిపై నటుడు విజయ్ ఆంటోని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. త్వరలోనే మాట్లాడతానని అభిమానులకు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను క్షేమంగా ఉన్నానని, వీలైనంత త్వరగా అందరితో మాట్లాడతానని నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony) తెలిపారు. తన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మలేషియాలో ఇటీవల జరిగిన ‘పిచ్చైకారన్’ 2’ (తెలుగులో బిచ్చగాడు 2) సినిమా చిత్రీకరణలో ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటన అనంతరం తొలిసారిగా విజయ్ స్పందించారు. ‘‘దవడ, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాల నుంచి బయటపడ్డా. సంబంధిత సర్జరీ పూర్తయింది. త్వరలోనే మీ అందరితో మాట్లాడతా’’ అని ఆయన తెలిపారు.
స్వీయ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తోన్న చిత్రమే ‘బిచ్చగాడు 2’ (Pichaikkaran 2). గతంలో ఈయన హీరోగా వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ‘బిచ్చగాడు’తోపాటు ‘డాక్టర్ సలీమ్’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఈ తమిళ నటుడు. ‘మహాత్మ, ‘దరువు’ చిత్రాలతో సంగీత దర్శకుడిగానూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad: సరదా తెచ్చిన సమస్య.. కాపాడిన తిరుమలగిరి పోలీసులు
-
Ap-top-news News
Tamil Nadu: తెలుగువారు తలచుకుంటే సాయంత్రానికి జీవో ఖాయం: కిషన్‌రెడ్డి
-
Ap-top-news News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్యం విషమం
-
India News
ట్రాన్స్‌జెండర్‌తో వివాహం.. యువకుడికి బంధువుల వేధింపులు
-
Politics News
Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
-
Ap-top-news News
Gas Cylinder: సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు