vijay devarakonda: సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్‌ దేవరకొండ..

వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 23 Apr 2024 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమానులను, సిబ్బందిని సర్‌ప్రైజ్‌ చేయడంలో హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఎప్పుడూ ముందుంటారు. తన వ్యక్తిగత సిబ్బంది ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ వారిని సంతోషపెడుతుంటారు. తాజాగా కుటుంబంతో కలిసి తన పర్సనల్‌ గార్డ్‌ పెళ్లికి హాజరై సందడి చేశాడీ హీరో. నూతన వధూవరులను ఆశీర్వదించి బహుమతులు అందించారు. అక్కడికి వచ్చిన పెద్దలు విజయ్‌ను సన్మానించి కత్తిని బహుకరించగా.. దానితో ఈ రౌడీ హీరో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందని.. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టంచేశారు. అయితే తన తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలన్నారు. ‘ఫ్యామిలీస్టార్‌’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న విజయ్‌ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. #VD12 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న సినిమాలో శ్రీలీల (Sreeleela) కథానాయిక. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని