Kushi: విజయ్‌-సామ్‌ల ‘ఖుషి’పై అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు

విజయ్‌ దేవరకొండ, సమంత(Samantha) ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఖుషి’ (Kushi). ఈ సినిమా షూటింగ్‌ గురించి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 30 Jan 2023 16:50 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత (Samantha) సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకుడు. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తోన్న రూమర్స్‌కు ఒక్క ట్వీట్‌తో చెక్‌ పెట్టాడు దర్శకుడు. సమంత తన అనారోగ్యం గురించి ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఎన్నో రూమర్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సామ్‌ ఈ చిత్రం నుంచి వైదొలగిందని.. మూవీ ఆగిపోయిందన్న పుకార్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

తాజాగా శివ నిర్వాణ ఈ సినిమా షూటింగ్‌పై అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చారు. అతి త్వరలోనే ‘ఖుషి’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిపారు. అంతా సజావుగా జరుగుతుందని ట్వీట్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. కొత్త పోస్టర్‌ విడుదల చేయాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. త్వరగా షూటింగ్‌ పూర్తిచేసి టీజర్‌ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇక ‘లైగర్‌’ తర్వాత విడుదలవుతోన్న ఈ చిత్రంపై విజయ్‌ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘లైగర్‌’ సినిమా ఊరించి ఊసూరనిపించడంతో ఈ రౌడీ హీరో ఫ్యాన్స్‌.. వాళ్ల ఆశలన్నీ ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఇప్పటికే 60 శాతంపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదలవుతోందా అని ఎదురుచూస్తున్నారు. ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని