Vijay Deverakonda: ఇప్పటికీ సర్దుకుపోతుంటా: విజయ్‌ దేవరకొండ

తన కొత్త సినిమా ‘ఫ్యామిలీస్టార్‌’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్‌ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్‌ దేవరకొండ. ఆ విశేషాలివీ..

Published : 26 Mar 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్ దేవరకొండ (vijay deverakonda) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (family star). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే విజయ్‌ పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ గురించి ఓ యూట్యూబర్‌తో ఆయన పంచుకున్న విశేషాలివీ.. 

‘‘వృత్తిపరమైన విషయాలు నాన్నతో, వ్యక్తిగత విశేషాలను అమ్మతో పంచుకుంటా. తమ్ముడు ఆనంద్‌కు అన్నీ చెబుతా. పాఠశాల రోజుల్లో సైకిల్‌ కావాలని మా నాన్నను అడిగితే తర్వాత బర్త్‌డేకు కొంటాననో, సెలవుల్లో తీసుకుంటాననో చెప్పేవారు. అలా ఎప్పటికో నా కోరిక నెరవేర్చారు. సైకిలే కాదు టీవీ, వీడియో గేమ్‌, కంప్యూటర్‌.. ఇలా బాల్యంలో అందరికీ వాటిపై ఆసక్తి ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల సర్దుకుపోవాల్సి వస్తుంది. అడ్జస్ట్‌మెంట్‌ అనేది జీవితంలో ఓ పాఠం. ఇప్పటికీ నేను ఏదో ఒక విషయంలో సర్దుకుపోతుంటా. మనకు కావాల్సింది దక్కకపోయినా లైఫ్‌లో ఎలా ముందుకెళ్లాలో నేర్చుకున్నా’’ అని తెలిపారు. అనంతరం, యూట్యూబర్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

* ఫ్యామిలీ స్టార్‌, ఖుషి.. మీరు నటించిన ఈ రెండింటిలో మీకు బాగా ఇష్టమైన చిత్రం?

విజయ్‌: ఫ్యామిలీ స్టార్‌

* బిర్యానీ, ముద్దపప్పు.. ఏది ఫేవరెట్‌?

విజయ్‌: బిర్యానీ

* ఎవరితోనైనా పరిచయం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఫేక్‌ ఇన్‌స్టా ఖాతా తెరిచారా?

విజయ్‌: ఎప్పుడూ అలా చేయలేదు

* మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు సంబంధించి మీరు యాక్టివ్‌గా ఉంటారా, మీ బృందమా?

విజయ్‌: నా టీమ్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అప్‌డేట్స్‌ను నాతో పంచుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని