Vijay Deverakonda: అవును.. నేను రిలేషన్‌లో ఉన్నా: విజయ్‌ దేవరకొండ

‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).

Published : 31 Mar 2024 00:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). దీని ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌, ‘ది’ ట్యాగ్‌పై  స్పందించారు.

‘‘నటుల పేరు ముందు స్టార్‌ ట్యాగ్స్‌ పెట్టే సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. నా చిత్రాల నిర్మాతలు కూడా నాకు ఏదైనా టైటిల్‌ పెట్టాలని చూశారు. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని. నా పేరు నాకు సరిపోతుందని భావించా. అమ్మానాన్నలు పెట్టిన పేరుతో సంతోషంగా ఉన్నా. విజయ్‌ దేవరకొండ ఒక్కడే. కాబట్టి, నాకేమైనా టైటిల్‌ పెట్టాలనుకుంటే కేవలం ‘ది’ (the) అని యాడ్‌ చేయాలని ఇటీవల చెప్పా. దానిని మించి నాకు ఏమీ నచ్చలేదు’’ అని విజయ్‌ చెప్పారు.

‘మీరు రిలేషన్‌లో ఉన్నారా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘అవును ఉన్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా’’ అని నవ్వుతూ బదులిచ్చారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అని అన్నారు. ఇలాంటి కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని పరశురామ్‌ కథ రాశాడని.. అది విన్నప్పుడు హీరో పాత్ర నిజ జీవితానికి దగ్గర ఉందనిపించిందన్నారు.

‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌, అజయ్‌ ఘోష్‌, వాసుకి కీలక పాత్రలు పోషించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న ఇది విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు దీనిని నిర్మించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని