Satya Dev: నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
సత్యదేవ్ కథానాయకుడిగా...శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫుల్‌బాటిల్’. సంజనా ఆనంద్ కథానాయిక.
సత్యదేవ్ (Satya Dev) కథానాయకుడిగా...శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫుల్‌బాటిల్’ (Full Bottle). సంజనా ఆనంద్ కథానాయిక. సర్వాంత్‌రామ్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి, ఎస్.డి.కంపెనీ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని శనివారం ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. అనంతరం చిత్రబృందం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కథానాయకుడు సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నాలోని ఆ కోణాన్ని ఈ సినిమాతో బయటికి తీసుకొచ్చాడు శరణ్. మెర్క్యురీ సూరి అనే పాత్రని నేను పోషించా. మనిషి జీవితం కూడా ఫుల్ బాటిల్‌లాంటిదే అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టాడు దర్శకుడు’’ అన్నారు. కార్యక్రమంలో కోన వెంకట్, చందు మొండేటి, కార్తీక్ దండు, సాయిరాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?