Vijay Deverakonda: ‘ఫ్యామిలీ స్టార్‌’పై దుష్ప్రచారం.. ఆ విషయంపై విజయ్ దేవరకొండ క్లారిటీ

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).

Updated : 11 Apr 2024 11:39 IST

హైదరాబాద్‌: ‘ఫ్యామిలీస్టార్‌’(Family Star)పై నెగెటివ్‌ రివ్యూలు ఇస్తున్న వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలకు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) స్పందించారు. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో ఇప్పటిది కాదన్నారు.

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు విజయ్ దేవరకొండపై విమర్శలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. దీనిపై విజయ్‌ టీమ్‌ మాదాపూర్ పీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రతికూల కామెంట్స్‌ చేస్తున్నారని తెలిపింది. ఆ పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే విజయ్‌ సైతం పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారంటూ ఓ ఫొటో బుధవారం చక్కర్లు కొట్టింది. దీనిపై ఆయన్ని సంప్రదించగా.. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టతనిచ్చారు. అది ఇప్పటి ఫొటో కాదని.. కొవిడ్‌ సమయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దిగినప్పటిదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని