Vijay Deverakonda: కుటుంబం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నా: విజయ్‌ దేవరకొండ

 ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు.

Published : 30 Mar 2024 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌, అజయ్‌ ఘోష్‌, వాసుకి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 5న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ తన కుటుంబాన్ని మంచి స్థాయిలో ఉంచేందుకు ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు.

‘‘అమ్మానాన్నలకు దూరంగా, బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకున్నా. మా బంధువులు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించేవాళ్లు. నేను ఇంటర్‌ చదువుతున్నప్పుడు మా నాన్న నన్ను చూసేందుకు అక్కడికి వచ్చారు. తిరిగి వేళ్లేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డారు. ఆయనని ఏసీ బస్సులో పంపించాలనుకున్నా. బస్సు కోసం ఎండలో ఎదురుచూస్తూ ఉన్నాం. వచ్చిన ఆ ఒక్క బస్సు చాలా రద్దీగా ఉండటంతో సాధారణ బస్సులోనే ప్రయాణమయ్యారు. ఆయనని అలా చూసి డబ్బు సంపాదించాలనుకున్నా. ఆయనకి కారు కొనివ్వాలని ఆశ పడ్డాను. కుటుంబాన్ని ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంచాలని నిర్ణయించుకున్నా. నిర్ణయమైతే తీసుకున్నా. కానీ అప్పటికి ఏం చేస్తే అనుకున్నది జరుగుతుందో తెలీదు. కొంతకాలానికి చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్నా. ఆ విషయం ఇంట్లో చెబితే ‘సినిమాల్లోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు. మీ నాన్నలా నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటావు’ అని అమ్మమ్మ భయపడేది. ఇందులో ఉంటే మంచి జీవితం ఉంటుందని ఆమెకు నమ్మకంగా చెబుతూ ఉండేవాన్ని. ఇప్పుడు నా కుటుంబం సంతోషంగా ఉంది’’ అని విజయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు