Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ- సుకుమార్‌ కాంబో.. అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తున్న వాటిలో విజయ్‌ దేవరకొండ- సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందననున్న సినిమా ఒకటి. ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ప్రశ్నపై నిర్మాత స్పందించారు.

Published : 20 May 2024 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)- డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ప్రకటన వెలువడి ఏళ్లు గడుస్తున్నా చిత్రం ఇప్పటికీ పట్టాలెక్కలేదు. ‘గం గం గణేశా’ ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన వంశీ కారుమంచి దానిపై స్పందించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘సుకుమార్‌, విజయ్‌ ఇద్దరూ బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్‌.. రామ్‌ చరణ్‌తో ఓ మూవీ చేయనున్నారు. అది పూర్తయిన తర్వాత విజయ్‌తో సినిమా తెరకెక్కిస్తారు. ఆ ప్రాజెక్టు తప్పక ఉంటుంది’’ అని తెలిపారు.

విజయ్‌ హీరోగా సుకుమార్‌ సినిమా తెరకెక్కించనున్నట్టు ఫాల్కన్‌ క్రియేషన్స్‌ సంస్థ 2020లోనే ప్రకటించింది. 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఆ బ్యానర్‌లో అదే తొలి సినిమాగా అనౌన్స్‌ చేశారు. అది ఆలస్యమవుతుండడంతో.. ఇప్పుడా సంస్థ నుంచి ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) వస్తోంది. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ (Anand Deverakonda) హీరోగా నూతన దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి రూపొందించిన చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్‌ కానుంది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్న రామ్‌ చరణ్‌.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్‌.. మూడు విభిన్న ప్రాజెక్టులు అనౌన్స్‌ చేశారు. దర్శకులు గౌతమ్‌ తిన్ననూరి, రాహుల్‌ సాంకృత్యాయన్‌, రవి కిరణ్‌ కోలా వాటిని తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని