Vijay Deverakonda: ప్రేమించా.. బ్రేకప్‌ అయ్యింది: విజయ్‌ దేవరకొండ

‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు.

Published : 31 Mar 2024 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చా..? అనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం సహజమేనని చెప్పిన ఆయన ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడాన్ని అంగీకరించనని తెలిపారు.

‘‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఉదాహరణకు నా స్నేహితులు చాలామంది రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు. దానివల్ల కొన్నేళ్లపాటు బాధ అనుభవించారు. ఆ తర్వాత మరొకరిని కలిశారు. ప్రేమలో పడ్డారు. కాబట్టి, వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని  ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్‌ కాలేదు’’ అని చెప్పారు.

కొత్త దర్శకులతో కలిసి వర్క్‌ చేస్తారా..? అని ప్రశ్నించగా.. ‘‘కొత్త దర్శకులతో వర్క్‌ చేయాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, అనుభవం లేకుండా బడ్జెట్‌, మేకింగ్‌ను మేనేజ్‌ చేయడం క్లిష్టమవుతుంది. ఒక్క సినిమా అయినా చేసిన దర్శకుడితో వర్క్ చేస్తా. సినిమా మేకింగ్‌పై అవగాహన ఉంటుంది. అతడి గత చిత్రం హిట్‌, ఫ్లాప్‌ అనేది చూడను’’ అని బదులిచ్చారు. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకెంతో ఇష్టమన్నారు. ‘డాడీ’లో బన్నీ డ్యాన్స్‌ చూసి అబ్బురపడినట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని