Vijay Deverakonda: ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్‌ దేవరకొండ

తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు.

Published : 29 Mar 2024 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. తన సినిమా విశేషాలు, పెళ్లి ముచ్చట్లు పంచుకున్నారు. ‘‘నాక్కూడా పెళ్లి చేసుకోవాలని, తండ్రి కావాలని ఉంది. కాకపోతే ఇప్పుడే చేసుకోను. ప్రేమ వివాహమే చేసుకుంటా. నా తల్లిదండ్రులకు ఆ అమ్మాయి తప్పక నచ్చాలి’’

‘‘కొంతమంది తమిళ దర్శకులు నాకు కథలు చెప్పారు. అందులో కొన్ని త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. గౌతమ్‌ తిన్ననూరితో నేను చేయబోయే చిత్రంలో చాలామంది కోలీవుడ్‌ నటీనటులు భాగం కానున్నారు’’ అని విజయ్‌ అన్నారు.

‘‘యూనివర్సల్‌ కంటెంట్‌తో ‘ఫ్యామిలీస్టార్‌’ రూపుదిద్దుకుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్‌ చేయనున్నాం. తమిళనాడులో 250 థియేటర్స్‌లో ఇది విడుదలవుతోంది. ఇటీవల సెన్సార్‌ పూర్తైంది. దీని రన్‌టైమ్‌ 2.40 గంటలు. నాలుగు ఫైట్స్‌ ఉన్నాయి. ఆ కారణంతోనే యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు’’ అని ఇదే ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న చిత్ర నిర్మాత దిల్‌రాజు అన్నారు

‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్‌ - విజయ్‌ దేవరకొండ కాంబోలో వస్తోన్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని