Vijay: ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’.. ఆ రోజే

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సమాయత్తమవుతున్నారు విజయ్‌.

Updated : 12 Apr 2024 12:34 IST

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సమాయత్తమవుతున్నారు విజయ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ బహుభాషా చిత్రాన్ని వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో విజయ్‌ కళ్లద్దాలు పెట్టుకుని నెరిసిన జుట్టు, గడ్డంతో సీరియస్‌గా చూస్తూ కనిపించారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం దీని చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ తాజాగా రష్యాలో ప్రారంభమైంది. మే చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని