Movie Updates: అప్‌డేట్స్‌ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్‌ డేట్‌తో విజయ్‌.. టైటిల్స్‌తో సల్మాన్‌, గోపీచంద్‌

అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి

Published : 11 Apr 2024 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ హీరో విజయ్‌ (Vijay), బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), టాలీవుడ్ కథానాయకుడు గోపీచంద్‌ తమ అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. రంజాన్‌ పండగను పురస్కరించుకుని తమ కొత్త చిత్రాల అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అవేంటంటే.. గోపీచంద్‌ (Gopichand)- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. కావ్యా థాపర్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి ‘విశ్వం’ (Viswam) టైటిల్‌ని ఖరారు చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. ఈమేరకు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

విజయ్‌ హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (greatest of all times). మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్‌ని చిత్రబృందం తాజాగా అనౌన్స్‌ చేసింది. ‘సికందర్‌’ (Sikandar) పేరు పెట్టినట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ చిత్రం విడుదల కానుంది. హీరోయిన్‌ వివరాలు ఇంకా ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని