Vijay Sethupathi: రామోజీరావు విజన్‌ ఆశ్చర్యపరిచింది

‘‘కొత్త కథలంటూ ఏమీ ఉండవు. ఇప్పటికే అన్నీ చెప్పేశాం. ఆ కథల్ని ఎంత కొత్తగా చెబుతున్నామనేదే ఇప్పుడు కీలకం. ‘మహారాజ’ విషయంలో నన్ను ఆకట్టుకున్నది కథనమే. అన్ని భాషల్లోని ప్రేక్షకులకూ నచ్చే భావోద్వేగాలున్న చిత్రమిది’’ అన్నారు విజయ్‌ సేతుపతి. ఆయన నటించిన 50వ చిత్రమే ‘మహారాజ’.

Updated : 11 Jun 2024 06:40 IST

‘మహారాజ’ వేడుకలో విజయ్‌సేతుపతి 

‘‘కొత్త కథలంటూ ఏమీ ఉండవు. ఇప్పటికే అన్నీ చెప్పేశాం. ఆ కథల్ని ఎంత కొత్తగా చెబుతున్నామనేదే ఇప్పుడు కీలకం. ‘మహారాజ’ విషయంలో నన్ను ఆకట్టుకున్నది కథనమే. అన్ని భాషల్లోని ప్రేక్షకులకూ నచ్చే భావోద్వేగాలున్న చిత్రమిది’’ అన్నారు విజయ్‌ సేతుపతి. ఆయన నటించిన 50వ చిత్రమే ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అభిరామి కీలక పాత్రధారులు. నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకుడు. సుధన్‌ సుందరం, జగదీశ్‌ పళనిసామి నిర్మాత. ఈ సినిమాని ఎస్వీఆర్‌ సినిమా సంస్థ ఈ నెల 14న  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్‌సిటీతో ముడిపడిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, రామోజీరావు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.

‘‘హైదరాబాద్‌ అంటే చాలు...నాకు రామోజీ ఫిల్మ్‌సిటీలో గడిపిన క్షణాలే గుర్తొస్తాయి. ధనుష్‌ చిత్రం ‘పుదుపేట్టై’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు నేను తొలిసారి రామోజీ ఫిల్మ్‌సిటీ చూశా. ఓ సినిమాకి కావల్సిన సకల సదుపాయాలు అక్కడు సమకూర్చిన విధానం చూసి ఆశ్చర్యపోయా. రామోజీరావు విజన్‌ గురించి విన్నాక షాకింగ్‌గా అనిపించింది. అలాంటి గొప్ప వ్యక్తి మరణం ఎంతో బాధకి గురిచేసింది. ఇన్నేళ్లుగా ఎంతో మంది దర్శకులు ఇంత మంచి సినిమాలు తీస్తున్నారంటే కారణం రామోజీ ఫిల్మ్‌సిటీలోని సదుపాయాలే’’ అన్నారు విజయ్‌ సేతుపతి. అనంతరం ఆయన చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘భావోద్వేగాలు, ప్రతీకారంతో ముడిపడిన ఓ కుటుంబకథా చిత్రమిది. ప్రతి కుటుంబానికి ఓ వ్యక్తి మహారాజలా కనిపిస్తుంటారు. కుటుంబం కోసం తను ఎంత దూరమైనా వెళతాడు. అలాంటి వ్యక్తిగా నేను కనిపిస్తా’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘అక్షర యోధుడు రామోజీరావు ఎన్నో గొప్ప సినిమాల్నీ ప్రేక్షకులకు అందించారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఆయన మరణం పరిశ్రమకి తీరని లోటు. మాస్, క్లాస్‌ అంశాలు  మేళవించిన చిత్రం  ‘మహారాజ’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మమతా మోహన్‌దాస్, అభిరామి, పంపిణీదారుడు శశిధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు