Merry Christmas: శతాబ్దాల నిరీక్షణ.. ఆ క్షణం కోసమే!

‘ఈ ప్రపంచం ఎప్పుడైతే కళ్లు తెరిచిందో.. అప్పట్నుంచే ఓ అరుదైన క్షణం కోసం మన వెతుకులాట మొదలైంది. ఆ సమయం వచ్చినప్పుడే అసలు విషయం అందరికీ అర్థమవుతుంది.

Updated : 21 Dec 2023 09:41 IST

‘ఈ ప్రపంచం ఎప్పుడైతే కళ్లు తెరిచిందో.. అప్పట్నుంచే ఓ అరుదైన క్షణం కోసం మన వెతుకులాట మొదలైంది. ఆ సమయం వచ్చినప్పుడే అసలు విషయం అందరికీ అర్థమవుతుంది. శతాబ్దాల నుంచి గడుపుతోంది ఆ క్షణం కోసమేనని’ అంటూ ‘మెరీ క్రిస్మస్‌’ ప్రపంచాన్ని పరిచయం చేసింది చిత్రబృందం. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేసింది కత్రిన. ‘మనం ప్రేమించే వ్యక్తి చనిపోతే.. వాళ్లతో పాటు మనపై వారు చూపిన ప్రేమ కూడా చనిపోతుంది. కానీ రోజు చస్తూ బతుకేది మాత్రం మనమే’, లాంటి సంభాషణలతో సాగుతున్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను రమేశ్‌ తరానీ, సంజయ్‌ రౌత్‌  నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని