Merry Christmas: వానవిల్లులా చీకటి నాట్యం

క్రిస్మస్‌ వేడుకను ఎంత ఘనంగా చేసుకుంటారో, ఆ ప్రత్యేకమైన రోజును కుటుంబంతో ఎంత ఆనందంగా గడుపుతారో తెలియజేస్తూ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది ‘మెరీ క్రిస్మస్‌’ చిత్రబృందం.

Updated : 27 Dec 2023 09:29 IST

క్రిస్మస్‌ వేడుకను ఎంత ఘనంగా చేసుకుంటారో, ఆ ప్రత్యేకమైన రోజును కుటుంబంతో ఎంత ఆనందంగా గడుపుతారో తెలియజేస్తూ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది ‘మెరీ క్రిస్మస్‌’ చిత్రబృందం. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ ట్రాక్‌ను ప్రేక్షకులకు క్రిస్మస్‌ కానుకగా సామాజిక మాధ్యమాల వేదికగా అందించారు. ఈ పాటను అష్‌ సింగ్‌ ఆలపించగా ప్రీతమ్‌ బాణీలు సమకూర్చారు. ‘రంగుల్లో వెలిగే చీకటే వానవిల్లుల నాట్యం చేసేనే’ అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంది. హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని