Vijay Sethupathi: షారుక్‌ ఖాన్‌ మాటలకు షాకయ్యా: విజయ్‌ సేతుపతి

తాను కీలక పాత్ర పోషించిన ‘జవాన్‌’ సినిమా ఈవెంట్‌లో విజయ్‌ సేతుపతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..

Published : 31 Aug 2023 01:36 IST

చెన్నై: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), నటి నయనతార (Nayanthara) ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర బృందం చెన్నైలో బుధవారం నిర్వహించింది. ఇందులో విజయ్‌ సేతుపతి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ అమ్మాయి విషయంలో తాను రివెంజ్‌ తీర్చుకున్నట్లు చెప్పారు. ‘‘మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ పార్టీలో మొదటిసారి షారుక్‌ను కలిశా. ఆయన పక్కన కూర్చొనే అవకాశం నాకు వచ్చింది. ఆరోజు ఆయన నన్ను ఎంతో ప్రశంసించారు. నా వర్క్‌ను మెచ్చుకున్నారు. ఆయన మాటలకు నేను షాకయ్యా. ఆయన అందరినీ ఒకేలా ట్రీట్‌ చేస్తారు. ఆయనతో కలిసి తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.

‘పుష్ప2’లో ఎలివేషన్స్‌.. ఒక్క ముక్కలో చెప్పేసిన అల్లు అర్జున్‌

అనంతరం చిత్ర దర్శకుడు అట్లీ గురించి మాట్లాడుతూ.. ‘‘అట్లీ గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. ఆయన దర్శకత్వంలో నటించడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘తెరీ’ అంటే నాకెంతో ఇష్టం. ఆయన వర్కింగ్‌ స్టైల్‌, సినిమాని తీర్చిదిద్దే తీరు నాకెంతో నచ్చుతుంది. మరో విషయం ఏమిటంటే.. నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు నేనొక అమ్మాయిని ప్రేమించా. ఆమెకు షారుక్‌ అంటే అమితమైన ఇష్టం. ఇప్పుడు షారుక్‌ సినిమాలో నేను కీలక పాత్ర పోషించి ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నా’’ అని సరదాగా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని