Vijay Sethupathi: ఆ లిస్ట్‌ చూసి ఎంతో బాధేసింది: విజయ్ సేతుపతి

విభిన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రాలకు గుర్తింపు రావాలని నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు.

Published : 08 Jan 2024 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన తాజా చిత్రం ‘మెరీ క్రిస్మస్‌’ (Merry Christmas). ఈనెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో ఆయన.. ఆస్కార్‌ నామినేషన్ల గురించి స్పందించారు.

‘‘ఆస్కార్‌ నామినేషన్లకు ఎంపికైన చిత్రాల లిస్ట్‌లో ‘సూపర్‌డీలక్స్‌’ లేనందుకు నాతోపాటు చిత్రబృందమంతా బాధపడింది. ఆ క్షణం నా గుండె పగిలినంత పనైంది. నేను ఆ సినిమాలో ఉండడం వల్ల అది ఆస్కార్‌కు వెళ్లాలని కాదు.. నేను అందులో నటించకపోయినా నామినేట్‌ అవ్వాలని కోరుకునే వాడిని. మంచి చిత్రానికి ఆదరణ లభించాలనేది నా ఉద్దేశం. మధ్యలో ఏం జరిగిందనే దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’’ అని చెప్పారు. ఆ చిత్రంలో విజయ్‌ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్‌ అవుతుందని అందరూ అనుకున్నారు.

ఇక ‘మెరీ క్రిస్మస్‌’ విషయానికొస్తే.. ఒక రాత్రి జరిగిన సంఘటన ఇద్దరి వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించారు. కత్రినా కైఫ్‌ కథానాయిక. ప్రీతమ్‌ స్వరాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు