Vijay Sethupathi: విలన్‌ పాత్రలు చేయకూడదనుకుంటున్నా: విజయ్‌ సేతుపతి

గోవా వేదికగా జరుగుతోన్న ‘ఇఫి’ వేడుకల్లో నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పాల్గొన్నారు. ప్రతి నాయకుడి పాత్రలు పోషించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 24 Nov 2023 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్: హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి తన నటనతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). ఇటీవల ‘జవాన్‌’ (Jawan)లో విలన్‌గా అలరించిన ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గోవాలో జరుగుతోన్న ‘ఇఫి’ వేడుకల్లో పాల్గొన్న విజయ్‌ సేతుపతి.. కొన్నేళ్లపాటు విలన్‌ పాత్రలు చేయాలనుకోవడం లేదన్నారు. ఎమోషనల్ ప్రెజర్‌ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘‘తమ సినిమాలో విలన్‌గా నటించమని కొన్నిసార్లు హీరోలు, దర్శకులు నాకు ఫోన్‌ చేసి అడిగేవారు. వాళ్లు నాపై ఎమోషనల్‌ ప్రెజర్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దానిని నేను ఎదుర్కొవాలనుకోవడం లేదు. విలన్‌ పాత్రలు పోషించడానికి నాకు బాధగా లేదు కానీ కొన్ని ఆంక్షలు ఉన్నాయి. వాళ్లు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయాలా? వద్దా? అనే విషయంలో రాను రాను నేను అయోమయంలో పడ్డా. అందుకే కొన్నేళ్ల పాటు విలన్‌ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని ఎవరికైనా చెప్తే.. కనీసం స్క్రిప్ట్ అయినా వినండి అంటున్నారు. అక్కడే మళ్లీ సమస్య మొదలవుతుంది’’ అని ఆయన చెప్పారు.

1996లో విడుదలైన ‘లవ్‌బర్డ్స్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌ సేతుపతి. ‘సుందరపాండియన్’తో తొలిసారి ఆయన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘పిజ్జా’, ‘రమ్మీ’, ‘నేనూ రౌడీనే’, ‘విక్రమ్‌ వేద’, ‘96’, ‘పేటా’, ‘మాస్టర్‌’, ‘ఉప్పెన’, ‘విక్రమ్‌’, ‘మైఖేల్‌’, ‘జవాన్‌’ ...తదితర చిత్రాల్లో ఆయన నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని