Vijay Sethupathi: విభీషణుడిగా విజయ్‌ సేతుపతి?

రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలొచ్చినా సినీప్రియులు ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు నితీశ్‌ కుమార్‌ రామాయణ మహాకావ్యాన్ని తెరపై చూపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Updated : 27 Jan 2024 11:20 IST

రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలొచ్చినా సినీప్రియులు ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు నితీశ్‌ కుమార్‌ రామాయణ మహాకావ్యాన్ని తెరపై చూపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రావణుడిగా యశ్‌ కనిపించనున్నారట. ఇప్పటి వరకు ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక విషయంలో ఎలాంటి సమాచారాన్ని ప్రకటించలేదు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ‘రావణుడి సోదరుడైన విభీషణుడి పాత్ర కోసం విజయ్‌ను సంప్రదించింది చిత్రబృందం. నితీశ్‌ చెప్పిన స్క్రిప్ట్‌ విన్న ఆయన ఈ సినిమాపై ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని