Vikram: తుది దశకు ‘తంగలాన్‌’

ఏ పాత్రనైనా తనదైన శైలిలో నటించి అభిమానులను సొంతం చేసుకుంటాడు చియాన్‌ విక్రమ్‌. ప్రస్తుతం తంగలాన్‌ అనే పాన్‌ ఇండియా చిత్రంలో తన వీరత్వాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

Updated : 24 May 2023 14:58 IST

ఏ పాత్రనైనా తనదైన శైలిలో నటించి అభిమానులను సొంతం చేసుకుంటాడు చియాన్‌ విక్రమ్‌ (Vikram). ప్రస్తుతం తంగలాన్‌ అనే పాన్‌ ఇండియా చిత్రంలో తన వీరత్వాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌(కేజీఎఫ్‌)లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా పా రంజిత్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. చిత్ర దర్శకుడు పా రంజిత్‌ మాట్లాడుతూ..‘విజయవంతంగా 105రోజుల చిత్రికరణను పూర్తిచేసుకున్నాము. మరో 20రోజులలో సినిమా షూటింగ్‌ పూర్తవుతోంది. దాని తర్వాత ముందస్తు నిర్మాణ పనులు మొదలవుతాయి’ అని అన్నారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్న ఈ సినిమాను 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ బహుళ, విదేశీ భాషల్లో 2డీ, 3డీ ఫార్మట్లతో విడుదలకు సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్‌, నీలం ప్రొడక్షన్‌ సంస్థల పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ స్వరాలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని