12Th Fail: ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ తెర వెనుక కథ

ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి ఐపీఎస్‌గా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న మనోజ్‌ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’. విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు.

Updated : 14 Apr 2024 13:19 IST

న్నో అవమానాలను ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి ఐపీఎస్‌గా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న మనోజ్‌ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’. విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు. విక్రాంత్‌ మాస్సే ఇందులో తన నటనతో సినీప్రియుల మనసుల్ని గెలుచుకున్నాడు. ఈ సినిమా తెర వెనుక ప్రయాణాన్ని చూపించడానికి ‘జీరో సే రీస్టార్ట్‌’ అనే పేరుతో ఓ ప్రాజెక్టును తీసుకురాబోతున్నట్లు తెలిపారు దర్శకుడు. తాజాగా ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ..ఇన్‌స్టాలో పోస్టర్‌ను పంచుకున్నారాయన. ‘‘ఎన్నో అవమానాలు..మరెన్నో విమర్శల మధ్య నిజాయతీగా గెలిచిన విజయవంతమైన కథ ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’. ఈ సినిమా ప్రారంభమైన మొదటి రోజు నుంచి దీన్ని థియేటర్లలో విడుదల చేయకుండా ఎదురైన అడ్డంకుల వరకూ ఓ క్రేజీ కథ రూపంలో తీసుకొస్తున్నాము. జులై 19న ఇది విడుదల కానుంది’’ అని వ్యాఖ్యల్ని జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని