12th Fail: అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్‌’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో

‘12th ఫెయిల్‌’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్‌ మస్సే తెలిపారు.

Published : 17 Apr 2024 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’ (12th Fail). విడుదలైన ప్రతిచోటా ఇది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం చైనా ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. విక్రాంత్‌ మస్సే ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ‘చాలా థ్రిల్‌గా, సంతోషంగా ఉంది. ప్రమోషన్‌ కోసం చైనా వెళ్లడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అక్కడ మన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే దీన్ని చైనాలోను విడుదల చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఎట్టకేలకు ఇది అక్కడ విడుదల కానుంది. 20వేల కంటే ఎక్కువ థియేటర్లలో ఇది రిలీజ్‌ కానుంది’ అని తెలిపారు. దీంతో చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు  పోస్ట్‌లు పెడుతున్నారు. 

‘12th ఫెయిల్‌’ చిన్న సినిమాగా విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకొని ఎన్నో రికార్డులు సాధించింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) టాప్‌ 250 ఉత్తమ చిత్రాల జాబితాలో 50వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఏకైక భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌ సాధించింది. ముంబయి మహానగర అడిషనల్‌ కమిషనర్‌ మనోజ్‌ జీవితమే ఈ కథ. మనోజ్‌ జీవిత కథను ఆయన మాజీ రూమ్‌మేట్‌ పాండే ఉరఫ్‌ అనురాగ్‌ పాథక్‌ ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్‌చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్‌ అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని