Rathnam: ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

విశాల్ ‘రత్నం’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 21 May 2024 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా హరి తెరకెక్కించిన చిత్రం ‘రత్నం’ (Rathnam). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ డ్రామా సినీ ప్రియులను మెప్పించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రసారం కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు టీమ్‌ పేర్కొంది. విశాల్‌ (Vishal) సరసన ప్రియా భవానీ శంకర్‌ నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలకపాత్రలు పోషించారు. 

క‌థేంటంటే: త‌మిళ‌నాడు, ఆంధ్ర స‌రిహ‌ద్దుల్లో సాగే క‌థ ఇది. ల‌క్ష్యం కోసం హ‌త్య‌లు చేయ‌డానికైనా వెన‌కాడ‌ని యువ‌కుడు ర‌త్నం (విశాల్‌). తాను మావ‌య్య అని పిలుచుకునే ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామి(స‌ముద్ర‌ఖ‌ని) అండ‌తో అప్పుడ‌ప్పుడూ చ‌ట్టాన్ని త‌న చేతుల్లోకి తీసుకుంటూ ప‌నులు చ‌క్కబెడుతుంటాడు. పోలీసుల‌కి స‌గం స‌మ‌స్య‌ల్ని త‌గ్గిస్తుంటాడు. ఎమ్మెల్యేకి కుడి భుజంలాంటి ర‌త్నం జీవితంలో ఎన్నో క‌ల్లోలాలు. చిన్నప్పుడే త‌ల్లి రంగనాయ‌కి పోలీస్‌స్టేష‌న్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. అత‌ని బాల్యం కొంత‌కాలం జైల్లో గ‌డుస్తుంది. అలాంటి ర‌త్నం జీవితంలోకి మ‌ల్లిక (ప్రియ‌భ‌వానీ శంక‌ర్‌) వ‌చ్చాక కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి (Rathnam on Amazon prime). త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణిని అడ్డాగా చేసుకుని ఎన్నెన్నో అరాచ‌కాలకు పాల్ప‌డుతుంటారు లింగం బ్ర‌ద‌ర్స్ (ముర‌ళీశ‌ర్మ‌, హ‌రీష్ పేర‌డి). వాళ్లే మ‌ల్లిక‌పై హ‌త్యాయ‌త్నం చేయ‌గా, ర‌త్నం కాపాడ‌తాడు. ఇంత‌కీ మ‌ల్లిక ఎవ‌రు?ఆమెని లింగం బ్ర‌ద‌ర్స్ చంపాల‌నుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?మ‌ల్లికని కాపాడేందుకు ర‌త్నం ఏం చేశాడు? అస‌లు ర‌త్నం త‌ల్లి రంగ‌నాయ‌కి పోలీస్‌స్టేష‌న్‌లో ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు